పొగాకు బోర్డు ఇన్‌చార్జి ఆర్‌ఎంగా సుబ్బారావు
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:04 AM
పొగాకు బోర్డు దక్షిణాది ప్రాంతీయ (ఒంగోలు) ఇన్‌చార్జి రీజనల్ మేనేజర్‌గా బి.సుబ్బారావు నియమితులయ్యారు. ఇక్కడ రెగ్యులర్ ఆర్‌ఎంగా ఉన్న లక్ష్మణరావును కర్ణాటకలో పొగాకు కొనుగోళ్ల నేపథ్యంలో మూడు నెలల క్రితం మైసూరు ఇన్‌చార్జి ఆర్‌ఎంగా పంపించారు.
రేపు ఒంగోలులో ఆవిర్భావ సభ
ఒంగోలు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): పొగాకు బోర్డు దక్షిణాది ప్రాంతీయ (ఒంగోలు) ఇన్‌చార్జి రీజనల్ మేనేజర్‌గా బి.సుబ్బారావు నియమితులయ్యారు. ఇక్కడ రెగ్యులర్ ఆర్‌ఎంగా ఉన్న లక్ష్మణరావును కర్ణాటకలో పొగాకు కొనుగోళ్ల నేపథ్యంలో మూడు నెలల క్రితం మైసూరు ఇన్‌చార్జి ఆర్‌ఎంగా పంపించారు. ఆ స్థానంలో గుంటూరులోని బోర్డు ప్రధాన కార్యాలయంలో సీనియర్ మేనేజర్‌గా ఉన్న కృష్ణశ్రీకి ఒంగోలు ఆర్‌ఎం బాధ్యతలు అప్పగించారు. కృష్ణశ్రీ మంగళ వారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ప్రస్తుతం గుంటూరు లోని ప్రధాన కార్యాలయంలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచే స్తున్న బి.సుబ్బారావుకు ఒంగోలు ఆర్‌ఎం ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన కొద్దిరోజులు మాత్రమే ఈ బాధ్యత లలో ఉంటారని, ప్రస్తుతం మైసూర్ ఇన్‌చార్జి ఆర్‌ఎంగా ఉన్న లక్ష్మణరావు తిరిగి ఒంగోలు వస్తారని సమాచారం.
భారత పొగాకు బోర్డు ఏర్పాటై 50ఏళ్లు పూర్తయిన సంద ర్భంగా ఈనెల 3న ఒంగోలులో ఆవిర్భావ సభ జరగనుంది. బోర్డు అధికారులు, వ్యాపార, రైతు ప్రతినిధులు, శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు. కాగా బోర్డు కార్యకలాపాలు 1975 జనవరి 1 నుంచి ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం గుంటూరు లోని ప్రధాన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. బోర్డు చైర్మన్, ఈడీ ఇతర పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో పొగాకు బోర్డు చట్టంలో మార్పులపై చర్చ జరిగినట్లు సమాచారం. జిల్లా నుంచి కూడా పలువురు రైతు ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు.