వైసీపీ హయాంలో సంక్షేమం శూన్యం
ABN , Publish Date - Jan 13 , 2025 | 11:42 PM
గత వైసీపీ పాలనలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అభివృద్ధి, సౌకర్యాలు శూన్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనర సింహారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక ఎస్‌సీ -2 హాస్టల్‌ను తనిఖీ చేశారు. హాస్టల్ పరి సరాలను పరిశీలించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అభివృద్ధి, సౌకర్యాలు శూన్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనర సింహారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక ఎస్‌సీ -2 హాస్టల్‌ను తనిఖీ చేశారు. హాస్టల్ పరి సరాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవర్గాలకు చెందిన కుటుంబాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్దుల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం గాలి కొదిలేసిందన్నారు. కనీస వసతులు కూడా లేక పోవటంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవే దన వ్యక్తం చేశారు. హాస్టళ్లల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు.
కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పనకు విప్ల వాత్మక మార్పులు తీసుకురానున్నట్లు డాక్టర్ ఉగ్ర చెప్పారు. హాస్టల్‌లో వసతుల కల్పనకు అవసరమైన పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణపై సర్వశిక్షా అభియాన్ అధికారులతో మాట్లాడారు. ఈమేరకు తగిన ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్‌లో ఉండి చదువుకోవటం ఓ అనుభూతిలా విద్యార్థులకు కల్పించాలన్నారు. ఉన్నతస్థాయికి ఎదిగి భవిష్యత్తు లో వారు అండగా నిలిచేలా హా స్టళ్ల పనితీరు మెరుగు పరచాల న్నారు. విద్యార్థులకు ప్రధానంగా చదువుతో పాటు టాయిలెట్స్, భోజన, విశ్రాంతి వసతులు సక్ర మంగా ఉండేందుకు చేపట్టాల్సిన పనులపై అంచనాలు తయారుచే యాలని అధికారులకు సూచించా రు. నాణ్యమైన భోజనం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం పట్టణంలోని కేఆర్‌సీ స్పోర్ట్స్ బాక్స్ క్రికెట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. బ్యాటింగ్ చేసి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గఫార్, సిద్ధాంతి బారాయిమాం, కృష్ణారెడ్డి, మనోజ్, విజయభాస్కర్‌రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.