పాఠశాల స్థాయి నుంచే పరిశోధనపై అవగాహన ఉండాలి
ABN , Publish Date - Jan 02 , 2025 | 11:17 PM
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శాస్త్ర పరిశోధనలపై అవగాహన ఉండాలని ఎంఈవో జి.వీరాంజనేయులు అన్నారు. మండలంలోని కొండమంజులూరు ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఎంఈవో ప్రారంభించారు.
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన నమూనాలు
పంగులూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శాస్త్ర పరిశోధనలపై అవగాహన ఉండాలని ఎంఈవో జి.వీరాంజనేయులు అన్నారు. మండలంలోని కొండమంజులూరు ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఎంఈవో ప్రారంభించారు. ఈ సైన్స్ ఫేర్‌లో వ్యక్తిగత విభాంగంలో 7, విద్యార్థుల సామూహిక విభాగంలో 8, ఉపాధ్యాయ విభాగంలో 4 ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. సమూహ విభాగంలో బూదవాడ ఉన్నత పాఠశాల బాలికలు సిరి చందన, సుహేన ప్రదర్శించిన ఎర్గోనామిక్ టూల్ ఫర్ లేబర్ సేవింగ్ నమూనా, వ్యక్తిగత విభాగంలో పంగులూరు ఉన్నత పాఠశాల విద్యార్థి షేక్ సాజిదా ప్రదర్శన, ఉపాధ్యాయ విభాగంలో బూదవాడ రసాయన శాస్త్ర బోధకుడు చంద్రశేఖర్ ప్రదర్శించిన అల్టిమేట్ ట్రాన్స్‌పోర్ట్ జిల్లా విద్యా వైజ్ఙానిక ప్రదర్శనకు ఎంపికయ్యాయి. మండల స్థాయిలో ఉత్తమ ప్రదర్శనలుగా ఎంపికైన వారు 3వ తేదీన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో ఎగ్జిబిట్ చేస్తారని హెచ్‌ఎం అణిత తెలిపారు. ఉత్తమ ప్రదర్శనలకు ప్రోత్సాహక బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో అజిత్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వడ్డవల్లి వీరనారాయణ, ముప్పవరం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ప్రసాద్, ఉపాధ్యాయులు సోమశేఖర్, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, రామకోటిరెడ్డి పాల్గొన్నారు.