Share News

రేపు అద్దంకిలో ముగ్గుల పోటీ

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:17 PM

ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు... గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్‌.. ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌) ఆధ్వర్యంలో అద్దంకిలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ శింగరకొండ సౌజన్యంతో శుక్రవారం జరగనున్నాయి. అద్దంకిలోని మార్కెట్‌ యార్డు ఆవరణలో ఉదయం 9 గంటలకు ముగ్గుల పోటీలు ప్రారంభం కానున్నాయి.

రేపు అద్దంకిలో  ముగ్గుల పోటీ

అద్దంకి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు... గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్‌.. ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌) ఆధ్వర్యంలో అద్దంకిలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ శింగరకొండ సౌజన్యంతో శుక్రవారం జరగనున్నాయి. అద్దంకిలోని మార్కెట్‌ యార్డు ఆవరణలో ఉదయం 9 గంటలకు ముగ్గుల పోటీలు ప్రారంభం కానున్నాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి, బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి మహిళలు ఈ పోటీలో పాల్గొనవచ్చు. మొదటి బహుమతిగా రూ.10వేలు, రెండవ బహుమతిగా రూ.6వేలు, 3వ బహుమతిగా రూ.4వేలు అందజేయనున్నారు. పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు పార్టిసిఫేషన్‌ గిఫ్ట్‌ను అందజేయనున్నారు.

Updated Date - Jan 01 , 2025 | 11:17 PM