క్రీడలపై యువత దృష్టి సారించాలి
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:30 PM
చదువుతో పాటు క్రీడలపై యువత దృష్టి సారించి ఉన్నత శిఖరాలు అందుకోవాలని మాజీ ఎమ్మెల్యే నార పుశెట్టి పాపారావు, టీడీపీ నియోజకవర్గ నాయ కుడు డాక్టర్ కడియాల లలిత్‌సాగర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళా శాల ఆవరణలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొట్టిపాటి-నారపుశెట్టి మెగా టోర్నమెంట్‌ను వారు ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లా డుతూ మచ్చలేని నాయకులైన మాజీ మంత్రి గొ ట్టిపాటి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే నార పుశెట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్‌ను ఏర్పాటుచేయటం ఆనందంగా ఉందన్నారు.
దర్శి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): చదువుతో పాటు క్రీడలపై యువత దృష్టి సారించి ఉన్నత శిఖరాలు అందుకోవాలని మాజీ ఎమ్మెల్యే నార పుశెట్టి పాపారావు, టీడీపీ నియోజకవర్గ నాయ కుడు డాక్టర్ కడియాల లలిత్‌సాగర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళా శాల ఆవరణలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొట్టిపాటి-నారపుశెట్టి మెగా టోర్నమెంట్‌ను వారు ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లా డుతూ మచ్చలేని నాయకులైన మాజీ మంత్రి గొ ట్టిపాటి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే నార పుశెట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్‌ను ఏర్పాటుచేయటం ఆనందంగా ఉందన్నారు. క్రీడ ల్లో గెలుపు, ఓటములను సమానంగా భావిం చి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలన్నా రు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని క్రీడలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ని ర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్ర మంలో తహసీల్దార్ ఎం.శ్రావణ్‌కుమార్, ఎస్సై ఎం.మురళీ, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్‌చైర్మన్ జి.స్టీవెన్, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు కె .చంద్రశేఖ ర్, మాజీ ఎంపీపీ ఫణిదపు వెంకటరామ య్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, మారెళ్ళ వెంకటేశ్వర్లు, ఎం.శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.