Share News

Purandeswari: కుటుంబంతో డాకు మహారాజు సినిమా చూసిన పురందేశ్వరి

ABN , Publish Date - Jan 14 , 2025 | 07:44 PM

రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి చీరాలలో డాకు మహారాజ్ సినిమా వీక్షించారు. సినిమా అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్రంలో

Purandeswari: కుటుంబంతో డాకు మహారాజు సినిమా చూసిన పురందేశ్వరి
Purandeswari

Daggubati Purandeswari: రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి నేడు చీరాలలో నటుడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా వీక్షించారు. బాపట్ల జిల్లా చీరాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండుగ సందర్భంగా తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ చీరాల వెళ్లిన దగ్గుబాటి పురందేశ్వరి.. మోహన్ థియేటర్ లో డాకు మహారాజ్ సినిమా చూశారు. పాప్ కార్న్ తింటూ మూవీని ఆస్వాదించారు. సినిమా అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. డాకు మహారాజ్ చిత్రంలో సామాజిక అంశాలున్నాయని, బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని అన్నారు. డాకు మహారాజ్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

Updated Date - Jan 14 , 2025 | 07:45 PM