Raghurama Krishna Raju : మాతృభాషే మన చిరునామా
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:02 AM
విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆదివారం ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ‘వారధి’ కార్యక్రమం జరిగింది.

తెలుగువారు తెలుగులోనే మాట్లాడుకోవాలి: ఉప సభాపతి రఘురామకృష్ణరాజు
విజయవాడ, మార్చి 16(ఆంధ్రజ్యోతి): మాతృభాష తెలుగువారి చిరునామా అని, మాతృభాషను ప్రేమించనివాడు తల్లిని ప్రేమించని వాడితో సమానమని శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆదివారం ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ‘వారధి’ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథి రఘురామ మాట్లాడుతూ తెలుగువారికి మాతృభాషలో చదువుకునేలా ప్రభుత్వాలు అవకాశం ఇవ్వాలన్నారు.
తెలుగువారు తెలుగులోనే మాట్లాడుకోవాలని పిలుపునిచ్చారు. సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ తెలుగు సినిమాల్లో నటించడం వల్ల భాషపై మమకారం పెరిగిందని చెప్పారు.