Blue Flag Recognition: బీచ్‌లలో గడ్డి పాకలు.. బీర్, వైన్ విక్రయాలు
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:41 AM
పర్యాటక శాఖ మంత్రి దుల దుర్గేశ్ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ను ఎగురవేసి, అక్కడ పర్యాటక అభివృద్ధికి కొత్త చర్యలను ప్రకటించారు. బీచ్ అభివృద్ధి కోసం మౌలిక వసతులను పెంచి, స్థానికుల సహకారంతో బ్లూ ఫ్లాగ్‌ను నిరంతరం నిలుపుదామన్నారు

రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ ఇక అజరామరం
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్
విశాఖపట్నం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): విదేశీ పర్యాటకు ల సంఖ్య పెరిగేందుకు రాష్ట్రంలోని బీచ్‌లలో శాక్స్(రెల్లి గడ్డి తో వేసిన పాకలు) ఏర్పాటు చేస్తామని, అక్కడ బీర్, వైన్ వంటి విక్రయాలు చేపడతామని పర్యాటక శాఖ మంత్రి కం దుల దుర్గేశ్ తెలిపారు. రుషికొండ బీచ్‌కు నెదర్లాండ్స్ బృం దం ఇచ్చిన బ్లూ ఫ్లాగ్‌ను ఆయన సోమవారం బీచ్‌లో ఎగుర వేశారు. మంత్రి మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధికి ప్రభు త్వం చాలా కృషిచేస్తోందని, ఇటీవలే పరిశ్రమ హోదా కూ డా ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల నిర్వహణ కొరవడడంతో రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారని వివరించారు. బీచ్ ను మరింత అభివృద్ధి చేసి, పర్యాటకులను ఆకర్షించేలా నిర్వహిస్తూ ఆ నీలి జెండా నిరంతరం ఎగిరేలా చేస్తామన్నా రు. ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ, బ్లూ ఫ్లాగ్ గుర్తింపు మరోసారి పోకుండా ఉండాలంటే స్థానికుల సహకారం ఎంతో అవసరమని చెప్పారు. ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి మాట్లాడుతూ, బీచ్‌ల నిర్వహణలో ప్రమాణాలు పాటిస్తేనే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వస్తుందన్నారు. రుషికొండ బీచ్‌లో గత 3 వారాల్లో అనేక మౌలిక వసతులు అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్రంలో మరో పది బీచ్‌లలో మౌలిక వసతులు కల్పించనున్నామన్నారు. కార్యక్రమంలో భీమిలి టీడీపీ ఇన్‌చార్జి గంటా రవితేజ, స్థానిక నాయకులు, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.