265 qualified దేహ దారుఢ్య పరీక్షల్లో 265 మంది అర్హత
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:04 AM
పోలీసు కానిస్టేబుల్ ని యామక ప్రక్రియలో భాగంగా ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు మైదానంలో శనివారం నిర్వహిం చిన దేహ దారుఢ్య పరీక్షల్లో 265 మంది అర్హత సాధించారు.
ఎచ్చెర్ల, జనవరి 11(ఆంధ్రజ్యోతి): పోలీసు కానిస్టేబుల్ ని యామక ప్రక్రియలో భాగంగా ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు మైదానంలో శనివారం నిర్వహిం చిన దేహ దారుఢ్య పరీక్షల్లో 265 మంది అర్హత సాధించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించారు. 660 మంది అభ్యర్థుల హాజరుకా వల్సిఉండగా, 414 మంది హాజరయ్యారు. కాగా సంక్రాంతి పండగ సెలవులు ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ తేదీల్లో దేహదారుఢ్య పరీక్షలు ఉండవని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ నెల 16న తిరిగి ఈ ఎంపికలు చేపడతామని స్పష్టం చేశారు.