Share News

road accident రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Jan 13 , 2025 | 11:48 PM

road accident కె.కొత్తూ రు సమీపంలో జాతీయరహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

road accident   రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

టెక్కలి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): కె.కొత్తూ రు సమీపంలో జాతీయరహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ రాలిలా ఉన్నాయి. పెద్దసాన గ్రామానికి చెందిన బందా పు అప్పారావు (50) రోడ్డు పక్క నుంచి వెళ్తున్న సమయంలో శ్రీకాకుళం నుంచి పలాస వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ వాహనం ఢీకొని ఈ ప్రమా దం జరిగింది. గాయ పడిన అప్పారావును జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిం చినప్పటికే మృతి చెంది నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్సపొందుతూ..

పాతపట్నం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): కాలినగాయాలతో శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ రవ్వ కృష్ణారావు(57) సోమవారం మృతిచెంది నట్లు ఎస్‌ఐ బి.లావణ్య తెలిపారు. స్థాని క ఉప్పర వీధికి చెందిన కృష్ణారావు పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా మృతుడి భార్య రోజా ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎస్‌ఐ బి.లావణ్య కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.

Updated Date - Jan 13 , 2025 | 11:48 PM