Share News

road accident రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Jan 13 , 2025 | 11:47 PM

road accident నగర సమీపంలోని పెద్దపాడు రోడ్డు ఓ కారు షోరూం ఎదురుగా సోమ వారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమా దంలో ఓ యువకుడు తీవ్రంగా గాయ పడ్డాడు.

road accident  రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
రెండు ముక్కలైన ద్విచక్రవాహనం

శ్రీకాకుళం క్రైం, జనవరి 13(ఆంధ్ర జ్యోతి): నగర సమీపంలోని పెద్దపాడు రోడ్డు ఓ కారు షోరూం ఎదురుగా సోమ వారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమా దంలో ఓ యువకుడు తీవ్రంగా గాయ పడ్డాడు. రూరల్‌ పోలీసులు తెలి పిన వివరాల మేరకు.. గార మండలం కొమర వానిపేటకు చెందిన ముర మండ రాజా అనే 28 ఏళ్ల యువకుడు విశాఖ-ఏ కాలనీ నుంచి పెద్ద పాడు వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తు న్న వాహనం ఢీకొనడంతో ఆ యువ కుడి తలకు బలమైన గాయాలు కావడం తో తీవ్ర రక్తస్రావం అయింది. స్థానికులు సమాచారం మేరకు చేరుకున్న 108 వాహ నంలో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు అక్కడి నుంచి కిమ్స్‌కు తరలించారు. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహ నం రెండు ముక్కలైంది. విషయం తెలుసుకున్న రూరల్‌ స్టేషన్‌ ఎస్‌ఐ వాసు దేవరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Updated Date - Jan 13 , 2025 | 11:47 PM