Share News

thiefs దొంగలొస్తారు జాగ్రత్త

ABN , Publish Date - Jan 10 , 2025 | 12:03 AM

సంక్రాం తి పండుగ సందర్భంగా మీ ఇంటికి దొంగలొస్తారు.. జాగ్రత్త అంటూ రెండో పట్టణ పోలీసులు వినూ త్నంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

thiefs దొంగలొస్తారు జాగ్రత్త
ఆటో ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు

  • టూటౌన్‌ పోలీసుల వినూత్న ప్రచారం

శ్రీకాకుళం క్రైం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): సంక్రాం తి పండుగ సందర్భంగా మీ ఇంటికి దొంగలొస్తారు.. జాగ్రత్త అంటూ రెండో పట్టణ పోలీసులు వినూ త్నంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నెల 9వ తేది నుంచి 16 వరకు స్కూల్స్‌, కళాశాలకు ప్ర భుత్వం సెలవులు ప్రకటించడంతో కుటుంబాలతో సొంత గ్రామాలకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసు కోవాని టూటౌన్‌ సీఐ పి.ఈశ్వరరావు కోరారు. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆటోపై ‘పండగకి మీ ఇంటికి దొంగలు వస్తారు జాగ్రత్త’ అనే బ్యానర్‌రు పెట్టి మైక్‌పై అప్రమత్తం చేస్తున్నారు. ఊరెళ్లే వారు సమాచారం అందిస్తే గస్తీ నిర్వహిస్తా మని, ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సౌకర్యాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు. దీని ద్వారా ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎటువంటి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సీఐ వివరించారు.

Updated Date - Jan 10 , 2025 | 12:03 AM