Share News

Tennycoit రాష్ట్ర టెన్నీకాయిట్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:31 PM

Tennycoit పలాసలో ఈనెల 11, 12వ తేదీల్లో జరగనున్న రాష్ట్ర టెన్నీకాయిట్‌ పోటీలకు జిల్లా జట్టును బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నతపాఠశాల క్రీడామైదానంలో ఎంపిక చేశారు.

 Tennycoit   రాష్ట్ర టెన్నీకాయిట్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
రాష్ట్ర టెన్నీకాయిట్‌ పోటీలకు ఎంపికైన జిల్లా జట్టుతో నిర్వాహకులు

పలాస, జనవరి 1(ఆంధ్రజ్యోతి): పలాసలో ఈనెల 11, 12వ తేదీల్లో జరగనున్న రాష్ట్ర టెన్నీకాయిట్‌ పోటీలకు జిల్లా జట్టును బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నతపాఠశాల క్రీడామైదానంలో ఎంపిక చేశారు. సంఘం కోశా ధికారి పి.తవిటయ్య ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా పీఈ టీలు బి.తిరుమల, ఎం.దామోదర్‌, సీహెచ్‌ తారకేశ్వరావు, ఎం.మణి కంఠ, ఎం.దిలీప్‌ వ్యవహరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అథ్లెటిక్స్‌ సంఘం సాంకేతిక కమిటీ చైర్మన్‌ కె.హరిబాబు, జిల్లా టెన్నీకాయిట్‌ సంఘం అధ్యక్షుడు మల్లా సంతోష్‌కుమార్‌, కార్యదర్శి ఎస్వీ జోగారావు, ఇన్‌చార్జి హెచ్‌ఎం టి.చిట్టిబాబు, మల్లా భద్రయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 11:31 PM