Share News

brokers దళారులను నమ్మి మోసపోవద్దు: ఎస్పీ

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:38 PM

brokers కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణలైనవా రికి దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.

brokers  దళారులను నమ్మి మోసపోవద్దు: ఎస్పీ
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణలైనవా రికి దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. అభ్యర్ధులెవరూ దళారు లను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి బుధవారం ఓ ప్రకటనను ఎస్పీ విడుదల చేశారు. రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వారిచే నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్‌ నియామకాల్లో జిల్లాలో 7,390 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహి స్తున్నామన్నారు. వీరిలో 6,215 మంది పురుషులు, 1,175 మంది మహిళలు ఉన్నారన్నారు. అయితే గడిచిన రెండు రోజుల్లో 1,139 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, మొదటి రోజు 322 మంది, రెండో రోజు 409 మందితో కలిపి మొత్తం 731 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో సోమవారం 192 మంది, మంగళ వారం 205 మంది కలిపి మొత్తం 397 మంది అభ్యర్థులకు ఛాతి, ఎత్తు, లాంగ్‌ జంప్‌, 1600, 100 మీటర్ల పరుగులో అర్హత సాధించారని ఎస్పీ వివరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ (పీఎంటీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ (పీఈటీ) పరీక్షలు నిర్వ హించడమే కాకుండా మైదానంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా ఎంపికలు చేస్తున్నట్టు చెప్పారు. ఎచ్చె ర్లలోని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసు మైదానంలో ఈ నెల 18 వర కు ఎంపికలు కొనసాగుతాయన్నారు. అభ్యర్థులు దళారులు, మధ్యవర్తులను నమ్మవద్దని ఎస్పీ సూచించారు. అటువంటి వారెవరైన ఎదురైతే సమాచారాన్ని సంబంధిత పోలీసు అధికారులకు, లేదా 63099 90800, 63099 90911 ఫోన్‌ నెంబర్లలో తెలియజేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ స్పష్టం చేశారు. అభ్యర్థులు కాల్‌ లెటర్‌లో తెలిపిన నిర్ధేశించిన తేది, సమయానికి ఒరిజనల్‌ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఒక సెట్‌ జెరాక్స్‌ కాపీతో హాజరుకావాలన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 11:38 PM