Share News

పాడి పర్రిశమతో రైతులకు మేలు

ABN , Publish Date - Jan 14 , 2025 | 12:26 AM

పాడి పరిశ్రమ అభివృద్ధితో రైతులకు మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

పాడి పర్రిశమతో రైతులకు మేలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

  • ఎమ్మెల్యే కూన రవికుమార్‌

బూర్జ, జనవరి 13(ఆంధ్రజ్యోతి): పాడి పరిశ్రమ అభివృద్ధితో రైతులకు మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. మండలంలోని డొంకలపర్త గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మినీ గోకులం (గోశాల)ను సోమవారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభు త్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని, ప్రజలకు అవసర మైన సదుపాయాలను కల్పించలేదని ఆరోపించారు. ప్రస్తుతం ప్ర భుత్వం రైతుల సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసి తీరుతామన్నారు. డొంకలపర్తలో ఆరు నెలల్లో ఇంటింటికీ తాగు నీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఈ గ్రామం నుంచి పాలకొండలో విద్యార్థులు చదువుతున్నారని, రాత్రిపూట వచ్చేసమయంలో చీకటి అవుతుందని ఎమ్మెల్యే దృష్టికి కొంతమంది మహిళలు తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన మూడు నెలల్లో ఈ గ్రామం నుంచి పాలకొండ ప్రధాన రహదారి వరకు వీధిదీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. బలగ స్వామినాయుడు జాతి స్థాయిలో స్విమ్మింగ్‌లో సౌత్‌జోన్‌లో ప్రథమ స్థానం సాధించినం దుకు ఎమ్మెల్యే, కూటమి నాయకులు సత్కరించారు. కార్యక్ర మంలో ఏపీ మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ రామకృష్ణనాయుడు, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాద్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2025 | 12:26 AM