Road Accident: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన.. విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ABN , Publish Date - Mar 15 , 2025 | 08:57 PM
లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

శ్రీకాకుళం: లావేరు మండలం బుడుమూరు (Budumuru) జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) సంభవించింది. కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా శ్రీకాకుళం జిల్లాకే చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం లోగిడి (Logidi) గ్రామానికి చెందిన ఓ కుటుంబం పని నిమిత్తం విశాఖపట్నానికి కారులో బయలుదేరింది.
అయితే బుడుమూరు వద్దకు రాగానే ప్రమాదవశాత్తూ కారు, బైక్ ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు, కారులో ప్రయాణిస్తున్న మహిళ, ఆమె ఇద్దరి కుమారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్రవాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మృతివార్త విన్న లోగిడి గ్రామస్థులు, బాధిత కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ramakrishna Case: టీడీపీ కార్యకర్త హత్యపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. పుంగనూరు పోలీసులకు షాక్..
Sunita Reddy: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన సునీతా రెడ్డి.. తండ్రి హత్యపై ఫిర్యాదు..