guidelines మార్గదర్శకాల మేరకు నిధులు వెచ్చించాలి
ABN , Publish Date - Jan 10 , 2025 | 12:07 AM
ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభి యాన్ (పీఎం ఉషా) కింద ఎంపికై న యూనివర్సిటీలు, విద్యా సంస్థలు నిర్ధేశించిన మార ్గదర్శకాల మేరకు నిధులు వెచ్చిస్తే తదుపరి నిధులు మంజూరునకు అవకాశం ఉంటుం దని కేంద్ర విద్యాశాఖ అదనపు కార్యదర్శి సునీల్‌కుమార్ బర్నేవల్ అన్నారు
ఎచ్చెర్ల, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభి యాన్ (పీఎం ఉషా) కింద ఎంపికై న యూనివర్సిటీలు, విద్యా సంస్థలు నిర్ధేశించిన మార ్గదర్శకాల మేరకు నిధులు వెచ్చిస్తే తదుపరి నిధులు మంజూరునకు అవకాశం ఉంటుం దని కేంద్ర విద్యాశాఖ అదనపు కార్యదర్శి సునీల్‌కుమార్ బర్నేవల్ అన్నారు. పీఎం ఉషా కింద ఎంపికైన వర్సిటీల వీసీలు, ఇతర అధికారులతో ఆయన గురువారం వర్చువల్‌లో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని పాల్గొన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఉదయభాస్కర్, పీఎం ఉషా వర్సిటీ సమన్వయకర్త డాక్టర్ టి.సంతోషి పావని తదితరులు పాల్గొన్నారు.