Livestock : పశుసంపదను పెంచుకోవాలి
ABN , Publish Date - Jan 11 , 2025 | 11:54 PM
Livestock :: పశుసంపదను పెంచుకోవాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. శనివారం మండలంలోని శేఖరాపురంలో గోశాలను ప్రారంభించారు.
మెళియాపుట్టి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): పశుసంపదను పెంచుకోవాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. శనివారం మండలంలోని శేఖరాపురంలో గోశాలను ప్రారంభించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ పాడిపరిశ్రమ రైతులు ఆర్థికంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడు తుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన రైతులు ముందుకు తీసుకురావడానికి ఉపాధి నిధులతో షెడ్లు ఏర్పాటు చేయ నున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో పశుసం వర్ధశాఖ జేడీ కంచరాన రాజగోపాల్, ఏడీ మంచు కరుణక రరావు, ఎంపీడీవో ప్రసాద్‌పండా, ఏపీవో రవి పాల్గొన్నారు.