Share News

drinking water : తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:57 PM

drinking water : పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో శాశ్వతంగా తాగునీటి కొరత తీర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం జంటపట్టణాల్లోని హడ్కో, శాంతినగర్‌కాలనీల్లో మంచినీటి పైపులైన్లకు శంకుస్థాపనచే శారు.

drinking water :  తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
పైపులైన్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస,జనవరి 11(ఆంధ్రజ్యోతి):పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో శాశ్వతంగా తాగునీటి కొరత తీర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం జంటపట్టణాల్లోని హడ్కో, శాంతినగర్‌కాలనీల్లో మంచినీటి పైపులైన్లకు శంకుస్థాపనచే శారు. కార్యక్రమంలో చైర్మన్‌ బళ్ల గిరిబాబు, వైస్‌చైర్మన్‌ మీసాల సురేష్‌ బాబు, వార్డు టీడీపీ ఇన్‌చార్జ్జి ఎ.రామకృష్ణ, కమిషనర్‌ ఎన్‌.రామారావు, డీఈఈ కనకరాజుతో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ఫపలాస ఆర్టీసీ డిపో ఆవరణలో రెండు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీసులను శిరీష ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, డీఎం ఆర్‌.సీతారామనాయుడు,ఆర్‌.సంతోష్‌ కుమార్‌, నాగరాజు, నవీన్‌, రవిశంకర్‌గుప్తా, జోగ మల్లి, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:57 PM