MLA NER డ్యాన్స్‌తో అలరించిన ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:11 AM
ఎన్‌ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సలో శుక్రవారం సంక్రాతి సంబరాలు ఘనంగా జరిగాయి.
రణస్థలం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ఎన్‌ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సలో శుక్రవారం సంక్రాతి సంబరాలు ఘనంగా జరిగాయి. స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు వేసిన ముగ్గులు చూపర్లను ఆకట్టుకున్నాయి. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సందడిగా డ్యాన్స్ చేశారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ నడుకుదిటి తేజాబాబు, సర్పంచ్ నడుకుదిటి రజిని, చందు, సీఐ అవతా రం, తహసీల్దార్ ఎన్.ప్రసాద్, ఎస్‌ఐ ఎస్. చిరంజీవి తదితరులు కూటమి నాయకు లు పాల్గొన్నారు. అలాగే గిరివానిపా లెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వరరావు పూజలు చేశారు.