Share News

Minister Kinjarapu Achchennaidu నూతన సందడి

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:32 PM

Minister Kinjarapu Achchennaidu:జిల్లాలో నూతన సందడి నెలకొంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో మంగళవారం కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు.

 Minister Kinjarapu Achchennaidu నూతన సందడి
కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుకు శుభాకాంక్షలు తెలుపుతున్న కలెక్టర్‌, ఎస్పీ, జేసీ తదితరులు

కోటబొమ్మాళి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నూతన సందడి నెలకొంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో మంగళవారం కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడును కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పెద్దఎత్తున నిమ్మాడకు తరలివచ్చారు. శాసన సభ్యులు గొండు శంకర్‌, గౌతు శిరీష్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ ఆహ్మద్‌ ఖాన్‌, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి తదితరులు మంత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


అనంతరం బాబాయ్‌, అబ్బాయ్‌లు కేక్‌ కట్‌ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు మేరకు కార్యకర్తలు బొకేలు, శాలువాల స్థానంలో నోటు పుస్తకాలు, పెన్నులను కొనుగోలు చేసి పేద పిల్లలకు అందించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోటీసులు గట్టిబందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ అద్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, రిటైర్డ్‌ ఎస్పీ కింజరాపు ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 11:32 PM