Rathasaptami శోభాయమానంగా రథసప్తమి వేడుకలు
ABN , Publish Date - Jan 01 , 2025 | 01:12 AM
Rathasaptami శోభాయమానంగా అరసవల్లి సూ ర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
అరసవల్లి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): శోభాయమానంగా అరసవల్లి సూ ర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మంగళవారం సతీ సమేతంగా ఆయన స్వామివారిని దర్శిం చుకున్నారు. అనంతరం ఆలయ అధికా రులు, అర్చకులతో ఈవో కార్యాలయంలో రథసప్తమి నిర్వహణ, ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పండుగగా నిర్ణయించిన రథసప్తమి వేడుకలను అత్యం త వైభవంగా నిర్వహించాల న్నారు. తొలిసారి అధికారికంగా మూడు రోజుల పండుగను నిర్వహి స్తున్నామని, ప్రపంచం మనవైపు చూసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. యూత్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతు న్నామని, ఇందులో భాగంగా ఈ నెల 2న జడ్పీ సమావేశ మందిరంలో అభి ప్రాయాల సేకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కనకరాజు, శ్రీనివాసరావు, రమణమూర్తి, టీడీపీ నాయకులు ఉంగటి వెంకటరమణ, జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.