Share News

Road works : రోడ్డు పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - Jan 08 , 2025 | 12:01 AM

Road works : శ్రీకాకుళం- ఆమదాల వలస ప్రధాన రహదారి పనులను సంక్రాంతికి పూర్తి చేయాలని ఆమ దాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఆదేశించారు. మంగళవారం రాగులు-వాకలవలస వద్ద జరుగుతున్న పనులు పరిశీలించారు.

Road works : రోడ్డు పనులు పూర్తి చేయాలి
ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడుతున్న కూన రవికుమార్‌

ఆమదాలవలస, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం- ఆమదాల వలస ప్రధాన రహదారి పనులను సంక్రాంతికి పూర్తి చేయాలని ఆమ దాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఆదేశించారు. మంగళవారం రాగులు-వాకలవలస వద్ద జరుగుతున్న పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్‌ అర్‌అండ్‌బీ అధికారులతో ఎమ్మెల్యే రవికుమా ర్‌ మాట్లాడారు. గతప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ రహ దారినివేగవంతంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావ డానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. వైసీపీ పాలనలో రహదారిలో గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరిగి ఎంతోమంది మృత్యువాతపడిన సంఘటనలు చోటు చేసుకున్నాయన్నా రు. సీఎం చంద్రబాబు,మంత్రులు నారా లోకేష్‌ బీసీ జనార్దనరెడ్డి రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేసి సహకరించారని తెలిపారు.

Updated Date - Jan 08 , 2025 | 12:02 AM