Sankranti జిల్లా అంతటా సంక్రాంతి శోభ
ABN , Publish Date - Jan 13 , 2025 | 11:50 PM
Sankranti సంక్రాంతి శోభ పట్టణాలు, పల్లెలకు తాకింది. ఆదివారం వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా స్వగ్రామాలకు తరలి రాగా సోమవారం భోగి వేడుకలను నిర్వ హించి ఆనందం పొందారు.
పట్టణాల్లో మార్కెట్లు కిటకిట
క్రీడా పోటీలతో
యువతలో ఉత్సాహం
గ్రామాల్లో సాంస్కృతిక సందడి
టెక్కలి/పాతపట్నం/పలాస రూరల్/ హరిపురం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి శోభ పట్టణాలు, పల్లెలకు తాకింది. ఆదివారం వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా స్వగ్రామాలకు తరలి రాగా సోమవారం భోగి వేడుకలను నిర్వ హించి ఆనందం పొందారు. సంక్రాంతికి అవసరమైన కొత్త దుస్తులు, సామగ్రిని కొనుగోలు చేసుకునేందుకు సమీపంలోని పట్టణాలకు గ్రామీణులు తరలిరావ డంతో పట్టణాల్లోని వీధులన్నీ కిటకిటలాడాయి. వస్త్ర దుకాణాలు, కిరాణా, కూరగాయలు, ఫ్యాన్సీ స్టోర్సులు రద్దీగా కనిపిం చాయి. ఆర్టీసీ బస్సులు, రైల్లే స్టేషన్లు ప్ర యాణికులతో కిట కిటలాడాయి. ఈ సందర్భంగా గ్రామా ల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. గాలిపటాలు ఎగురవేత, మహిళలకు టాగ్ ఆఫ్ వార్, రంగవల్లికల పోటీలను నిర్వ హించారు. అలాగే యువతకు క్రికెట్, వాలీబాల్ పోటీల ను నిర్వహించి బహుమతులు అందించారు. అలాగే వివిధ కళారూపాల ప్రదర్శన నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు, బాల బాలికల జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఘనంగా సంక్రాంతి సంబరాలు
పాతపట్నం, జనవరి 13 (ఆంద్రజ్యోతి): పెద్దసీది జడ్పీ హైస్కూల్ ఆవరణలో గ్రామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి సంబరాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. సుమారు 85 మంది మహిళలు పాల్గొని రంగవల్లులను వేశారు. విజేతలకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నగదు పురస్కారం, జ్ఞాపికలను అందిం చారు. పలువురు నిర్వాహకులు పాల్గొన్నారు.