Share News

Sand ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోరా?

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:01 AM

బాహుదా నది వంతెన పక్కనే ఇసుక బకాసు రులు పట్టపగలే ఇసుక అక్రమ రవాణా చేస్తు న్నా రెవెన్యూ, అధికారులు పట్టించుకోక పోవడంపై జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు ధ్వజమెత్తారు.

Sand  ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోరా?
బాహుదానదిలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్న దాసరి రాజు

ఇచ్ఛాపురం జనవరి 12 (ఆంధ్రజ్యోతి): బాహుదా నది వంతెన పక్కనే ఇసుక బకాసు రులు పట్టపగలే ఇసుక అక్రమ రవాణా చేస్తు న్నా రెవెన్యూ, అధికారులు పట్టించుకోక పోవడంపై జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు ధ్వజమెత్తారు. ఆదివారం మద్యాహ్నం సుమారు 10 ట్రాక్టర్లు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. గమనించిన రాజు ఇసుక అక్రమ రవాణా ఆపాలని వారికి కోరారు. బాహుదాలో అక్రమ ఇసుక తవ్వకాలు వలన వంతెనకు ప్రమాదం ఉందని ఇదివరకే ఎన్నోసార్లు మొత్తుకున్నా అప్పుడు అధికారులు పట్టించుకోకపోవడంతో గతంలో వంతెన సంగభాగం కూలిపోయిం దన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారడం లేదని మండి పడ్డారు. ఇప్పటికైనా స్పందించకపోతే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.

Updated Date - Jan 13 , 2025 | 12:01 AM