High Court Judge శ్రీముఖలింగేశ్వరుని సేవలో తెలంగాణ హైకోర్టు జడ్జి
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:22 AM
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనపమ చక్రవర్తి కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
జలుమూరు, జనవరి 13: (ఆంధ్రజ్యోతి) దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనపమ చక్రవర్తి కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం వారి గోత్ర నామాలతో స్వామికి ప్రత్యేక పూజలు, అభిషే కాలు చేయించారు. అనంతరం శేషవస్త్రాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ విశిష్టతతో పాటు పురాణ గాథను అర్చకులు వివరించారు. వారితో పాటు ఆలయ ఈవో పి.ప్రభాకరరావు ఉన్నారు.