Share News

సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - Jan 08 , 2025 | 12:07 AM

సమస్యల పరిష్కారమే ధ్యేయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళంలోని విశాఖ-ఏ కాలనీలో గల తన కార్యాలయంలో గ్రీవెన్స్‌కు నిర్వహించారు.

 సమస్యల పరిష్కారమే ధ్యేయం
వినతులను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారమే ధ్యేయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళంలోని విశాఖ-ఏ కాలనీలో గల తన కార్యాలయంలో గ్రీవెన్స్‌కు నిర్వహించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామాల్లో కనీస సదుపాయాలకు కూడా ప్రజలు నోచుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పల్లె పండు గ, గ్రామసభలు నిర్వహించి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతోందని తెలిపారు. వైసీపీ హయాంలో ఛిన్నాభిన్నమైన వ్యవస్థలను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. రైతులకు ధాన్యం అమ్మిన 24 గంటల్లోగా వారి అక్కౌంట్లలో నగదును జమ చేస్తున్నామన్నారు.

Updated Date - Jan 08 , 2025 | 12:07 AM