Share News

Rangoli: నేడే.. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:38 PM

Rangoli Competition సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. పండుగ నేపథ్యంలో ఏటా మాదిరి ఈ ఏడాదీ ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీల నిర్వహణకు రంగం సన్నద్ధమైంది.

Rangoli: నేడే.. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

శ్రీకాకుళంలో ఎన్టీఆర్‌ ఎంహెచ్‌ స్కూల్‌ మైదానంలో నిర్వహణ

విజేతలకు భారీగా నగదు పురస్కారాలు...

శ్రీకాకుళం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. పండుగ నేపథ్యంలో ఏటా మాదిరి ఈ ఏడాదీ ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీల నిర్వహణకు రంగం సన్నద్ధమైంది. ‘‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలకు.. గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్‌.. ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌)’’ సహకారం అందించనున్నాయి. మహిళలు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని.. అందమైన ముగ్గులు వేసి.. ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకోవాలని ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ పిలుపునిస్తోంది.

శ్రీకాకుళంలోని ఎన్టీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ మైదానంలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పోటీలు జరుగుతాయి. ఆకర్షణీయమైన మూడు ముగ్గులను న్యాయనిర్ణేతలు ఎంపిక చేసి విజేతలకు బహుమతులతో పాటు నగదు పురస్కారాన్ని అందజేస్తారు. ప్రథమ విజేతకు రూ.6వేలు, ద్వితీయ విజేతకు రూ.4వేలు, తృతీయ విజేతకు రూ.3వేలతోపాటు మెమొంటోలను ఇస్తారు. పోటీల్లో పాల్గొన్న మహిళలకు కన్సొలేషన్‌ బహుమతులు కూడా అందజేస్తారు. శ్రీకాకుళంలో ముగ్గుల పోటీలకు.. స్పాన్సర్‌గా మీనాక్షి హాస్పిటల్‌ ప్రముఖ సర్జికల్‌ గ్రాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌, లేపరోస్కోపిక్‌ సర్జన్‌ డా.గంగాధర్‌రావు గొండు, స్త్రీ ప్రసూతి వైద్యనిపుణులు, లేపరోస్కోపిక్‌ సర్జన్‌ డా.సీహెచ్‌ హరిత వ్యవహరిస్తున్నారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన విజేతను ఈ నెల 11న విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో ఏకంగా రూ.1.50 లక్షల విలువగల బహుమతులను గెలుచుకోవచ్చు. ఆసక్తి గల మహిళలు తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు 9985411526 నంబర్‌కు సంప్రదించవచ్చు.

ఇవీ నిబంధనలు..

ముగ్గుల పోటీల్లో మహిళలు మాత్రమే పాల్గొనాలి. పోటీల్లో పాల్గొనేందుకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. కేవలం చుక్కల ముగ్గులను మాత్రమే వేయాలి. ఎన్ని చుక్కలు, ఎన్ని వరుసలో ముగ్గు వేస్తున్నారో న్యాయనిర్ణేతలకు స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. ముగ్గు వేయడానికి గరిష్ఠ సమయం కేవలం రెండు గంటలు మాత్రమే. ముగ్గు చేతితోనే వేయాలి. గొట్టాలు, బద్దలు వంటివి ఉపయోగించకూడదు. జల్లెడ ఉపయోగించేందుకు అనుమతి ఉంది. ముగ్గుల్లో గొబ్బెమ్మలను, బతుకమ్మలను అమర్చుకోవచ్చు.. కానీ ఇతరత్రా వస్తువులను అదనపు ఆకర్షణ కోసం వాడకూడదు.

Updated Date - Jan 03 , 2025 | 11:38 PM