Share News

Traffic jam రైల్వే గేటు వద్ద ట్రాఫిక్‌ జామ్‌

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:10 AM

రైల్వే ఉత్తర క్యాబిన్‌ రత్తకన్న ఎల్‌సీ గేటు వద్ద ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. దీంతో పాదచారులు, వాహనదారు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Traffic jam రైల్వే గేటు వద్ద ట్రాఫిక్‌ జామ్‌
గేటు మధ్యలో నిలిచిపోయిన వాహనాలు

ఇచ్ఛాపురం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రైల్వే ఉత్తర క్యాబిన్‌ రత్తకన్న ఎల్‌సీ గేటు వద్ద ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. దీంతో పాదచారులు, వాహనదారు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. ఇరువైపులా రైళ్లు ఒక్కసారి రావడంతో గేటుకు రెండు పక్కల వందలాది కార్లు, వ్యాన్లు, ఆటోలు, ద్విచక్ర వాహనా లు నిలిచిపోయాయి. 20 నిమిషాలపాటు గేట్‌ తీ యకపోవడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపో యాయి. గేట్‌ తీసిన తర్వాత ఇరు వైపుల వాహనాలు ఒకేసారి గేటు దాటే క్రుమంలో మధ్యలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. మరో రైలు వచ్చేస్తుందని గేట్‌మన్‌ హారన్‌ కొడు తూ చెబుతున్నా వాహనాలు కదలకపోవడంతో గందరగోళం నెలకొంది. తర్వాత ఒకొక్కటిగా వాహనాలు కదలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Jan 11 , 2025 | 12:10 AM