open a case sheet దొంగలపై కేడీషీట్ తెరుస్తాం
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:13 AM
దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కేడీషీట్ తెరుస్తామని ఎస్పీ కేవీ మహే శ్వరరెడ్డి తెలిపారు.
ఎస్పీ మహేశ్వరరెడ్డి
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు
శ్రీకాకుళం క్రైం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కేడీషీట్ తెరుస్తామని ఎస్పీ కేవీ మహే శ్వరరెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర గొలుసు దొంగలను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురానికి చెందిన సుజిత్ కుమార్ పాడి, బాలకృష్ణ సాహు.. కొత్తూరు, మందస, ఎచ్చెర్ల, కోటబొమ్మాళి పోలీసు స్టేషన్ల పరిధిలో గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. వీరిద్దరూ 2024 డిసెంబరు 28న కొత్తూరు మండలం కాశీపు రం గ్రామంలో రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ మహిళ మెడలోని తులంన్నర బంగారు పుస్తల తాడును ఎదరుగా బైక్‌పై వచ్చిన తెంపేసుకుని పారిపోయారు. అదే ఏడాది నవంబరు 8న మందస మండలం నర్సింగపురం గ్రామం వెళ్తున్న ఓ మహిళ మెడలో పావు తక్కువ మూడు తులాలు బంగారు పుస్తలతాడును బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తెంపేసి పట్టుకుని పారి పోయారు. గత నెల 28న ఎచ్చెర్ల బైపాస్ సమీపంలో గొర్రెలు మేపుతున్న మహిళ మెడలోని రెండు తులాల పుస్తెల తాడు ను ఇద్దరు వ్యక్తులు బైక్ వచ్చి తెంపి పారిపోదామని ప్రయ త్నించగా.. ఆ మహిళ ప్రతిఘటించడంతో ఆమె చేతిలో అర తులం బంగారం తాడు ఉండిపోయింది. అలాగే కోటబొమ్మాళి మండలం నారాయణపురం సంతలో సామగ్రి కొనుక్కొని తిరిగి ఇంటికి వెళ్తున్న మహిళ మెడలో పుస్తల తాడును కూడా తెంపేసి పట్టుకుని పారిపోయారు. ఇలా దొంగతనం చేసిన బంగారు ఆభరణాలు వారిద్దరు తమ ఇళ్లల్లో దాచి పెట్టారు. కాగా బరంపురం గొడవల్లో అరెస్ట్ అయిన సుజిత్‌కు జైలులో బాలకృష్ణ పరిచయం అయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత వీరిద్దరు దొంగతనాలకు పాల్పడ్డారు. 2016 నుంచి 2024 వరకు వీరిద్దరిపై జిల్లాలో 32 కేసులు ఉన్నాయని, వీటిలో కంచిలి, మందస, బారువ, నందిగాం కేసుల్లో ఇద్దరికి గతంలో శిక్ష పడిందని ఎస్పీ వివరించారు. ఈ నెల 9న మెట్టూరు జంక్షన్ వద్ద కొత్తురు పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పందంగా తిరుగుతుండడం తో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా పై నేరాలకు పాల్పడినట్టు అంగీకరించారు. వీరి నుంచి ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్టు ఎస్పీ తెలిపారు. అలాగే వీరిద్దరిపై కేడీషీట్స్ కూడా తెరుస్తామని స్పష్టం చేశారు. ఈ కేసును ఏఎస్పీ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఛేదించిన కొత్తూరు సీఐ సీహెచ్ ప్రసాద్, ఎస్‌ఐ అమీర్ ఆలీ, కానిస్టేబు ల్స్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమా వేశంలో ఎస్పీతో పాటు ఏఎస్పీలు శ్రీనివాసరావు, రమణ, ఎస్‌బీ సీఐ ఇమాన్యుయల్ రాజు తదితరులు పాల్గొన్నారు.