డుంబ్రిగుడలో 9 డిగ్రీలు
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:28 PM
మన్యంలో చలి తీవ్రత పెరుగుతుండడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో డుంబ్రిగుడలో 9.0 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
మన్యంలో దిగజారిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
దట్టంగా కురుస్తున్న పొగమంచు
పాడేరు, జనవరి 1(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత పెరుగుతుండడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో డుంబ్రిగుడలో 9.0 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే అరకులోయలో 10.0, జీకేవీధిలో 10.3, జి.మాడుగులలో 10.4, చింతపల్లి, పాడేరు, పెదబయలులో 10.6, హుకుంపేటలో 11.0, ముంచంగిపుట్టులో 12.1, అనంతగిరిలో 12.9, కొయ్యూరులో 15,7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. తాజా వాతావరణంతో మన్యంలోని ప్రకృతి అందాలు మరింత సుందరంగా దర్శనమిస్తుండడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.