బాలింతకు తప్పని డోలీమోత
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:30 PM
మండలంలోని పినకోట పంచాయతీ గడ్డిబంధ గ్రామానికి చెందిన తామర్ల పైడితల్లి అనే గర్భిణికి బుధవారం ఉదయం పురిటినొప్పులు వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే ఇంటి వద్దనే ప్రసవించింది.
గడ్డిబంధ సమీపంలో కల్వర్టు కొట్టుకుపోవడంతో రెండు కిలో మీటర్లు మోసుకెళ్లాల్సిన దుస్థితి
అనంతగిరి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని పినకోట పంచాయతీ గడ్డిబంధ గ్రామానికి చెందిన తామర్ల పైడితల్లి అనే గర్భిణికి బుధవారం ఉదయం పురిటినొప్పులు వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే ఇంటి వద్దనే ప్రసవించింది. అయితే గడ్డిబంధ గ్రామ సమీపంలోని కల్వర్టు వర్షాలకు కొట్టుకుపోవడంతో వాహనాలు వచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబ సభ్యులు రెండు కిలో మీటర్లు డోలీపై తల్లి, బిడ్డను మోసుకుంటూ బోనూరు వరకు వచ్చారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లోని పినకోట పీహెచ్‌సీకి తరలించారు. అధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణం చేపట్టి రవాణా కష్టాలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.