బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఆందోళన
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:14 AM
మండలంలో బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయొద్దంటూ చందనాడ, రాజయ్యపేట, అమలాపురం, బోయపాడు, తదితర గ్రామాల్లో రైతులు, మత్స్యకారులు ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులు, సీపీఎం, వైసీపీ నాయకులు, బల్క్ డ్రగ్ పార్క్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేసే వేదిక వద్దకు రాకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
పలు గ్రామాల్లో రైతులు, మత్స్యకారులు ధర్నా
అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం
నక్కపల్లి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలో బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయొద్దంటూ చందనాడ, రాజయ్యపేట, అమలాపురం, బోయపాడు, తదితర గ్రామాల్లో రైతులు, మత్స్యకారులు ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులు, సీపీఎం, వైసీపీ నాయకులు, బల్క్ డ్రగ్ పార్క్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేసే వేదిక వద్దకు రాకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. రాజయ్యపేట, చందనాడ, బుచ్చిరాజుపేట, అమలాపురం, వేంపాడు, చందనాడ, ఎన్.నర్సాపురం తదితర గ్రామాల్లో సీఐలు కుమారస్వామి, అప్పన్న, రామకృష్ణ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఆందోళనకారులు తమ గ్రామాల్లోనే నిరసనలు తెలిపారు. రాజయ్యపేటలో ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. మత్స్యకార మహిళలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ప్రమాదకరమైన రసాయన పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే తమ భవిష్యత్లు నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.