Share News

కొనసాగుతున్న చలి తీవ్రత

ABN , Publish Date - Jan 13 , 2025 | 11:26 PM

మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. సోమవారం డుంబ్రిగుడలో 8.2 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

కొనసాగుతున్న చలి తీవ్రత
పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ మార్గంలో సోమవారం దట్టంగా కమ్ముకున్న పొగమంచు

దిగజారుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

డుంబ్రిగుడలో 8.2 డిగ్రీలు

పాడేరు, జనవరి 13(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. సోమవారం డుంబ్రిగుడలో 8.2 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం పదిన్నర గంటల వరకు పొగ మంచు దట్టంగా కురుస్తుండగా కేవలం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మాత్రమే ఒక మోస్తరుగా ఎండ ప్రభావం చూపుతుంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి చలి వాతావరణం కొనసాగుతున్నది.

దిగజారుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

తాజా వాతావరణంతో ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం డుంబ్రిగుడలో 8.2 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, జి.మాడుగులలో 8.3, జీకేవీధీఽలో 8.6, అరకులోయలో 8.7, చింతపల్లిలో 8.9, హుకుంపేటలో 10.1, అనంతగిరిలో 10.6, పెదబయలులో 10.8, ముంచంగిపుట్టులో 11.5 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి.

Updated Date - Jan 13 , 2025 | 11:26 PM