కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Jan 10 , 2025 | 10:40 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలతోపాటు చలి తీవ్రత కొనసాగుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగానే కురుస్తున్నది.
అరకులోయలో 8.2 డిగ్రీలు నమోదు
దట్టంగా కురుస్తున్న పొగమంచు
చలితో వణుకుతున్న మన్యంవాసులు
పాడేరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలతోపాటు చలి తీవ్రత కొనసాగుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగానే కురుస్తున్నది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం పదిన్నర గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో అరకులోయలో 8.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా జి.మాడుగులలో 9.0, అనంతగిరిలో 9.5, జీకేవీధిలో 9.8, చింతపల్లిలో 10.1, హుకుంపేటలో 10.5, పాడేరులో 11.1, కొయ్యూరులో 131 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శీతాకాలం తీవ్రత అధికంగా ఉండడంతో మరికొన్ని రోజులు చలి ప్రభావం తీవ్రంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు.