ప్యాకేజీలు కాదు, ఆర్థిక సాయం చేయాలి
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:35 AM
స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ తన పర్యటనలో ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఫటా... ఫట్!!
విశాఖ ఉక్కు గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ
స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ తన పర్యటనలో ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్లాంటుపై కేంద్రం నుంచి ఏమి కోరుకుంటున్నారో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్, గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.
ప్ర: ప్యాకేజీ ఇస్తామంటున్నారు కదా?
జ: ఇప్పుడు ప్యాకేజీలు ప్రధానం కాదు. ఆర్థిక సాయం కావాలి.
ప్ర: ఎటువంటి ఆర్థిక సాయం కావాలి?
జ: గతంలో వాజపేయి హయాంలో చేసినట్టే క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేయాలి. దీనివల్ల వడ్దీల బాధ తప్పుతుంది. నెలకు రూ.250 కోట్లు వడ్డీలకు చెల్లిస్తున్నాం.
ప్ర: సెయిల్‌లో విలీనం చర్చల్లో ఉందా?
జ: అదే మా ప్రధాన డిమాండ్. ఇదే అంశంపై కూటమి పార్టీలన్నీ తీర్మానం కూడా చేశాయి. ఇప్పుడు దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు.
ప్ర: సొంత గనులు?
జ: విశాఖ స్టీల్‌ప్లాంటు పెట్టినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నాం. కొత్తగా నక్కపల్లిలో ఏర్పాటయ్యే ఆర్సెలర్ మిట్టల్ ప్లాంటుకు సొంత గనుల కోసం ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నారు గానీ విశాఖ స్టీల్‌ను గుర్తించడం లేదు.
విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి