Share News

పూడిమడకలో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌

ABN , Publish Date - Jan 08 , 2025 | 01:05 AM

మండలంలోని పూడిమడక సమీపంలో ఎట్టకేలకు ఎన్‌టీపీసీ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు కానున్నది. ఎన్‌టీపీసీ అనుబంధ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నిర్మించే ‘గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌’కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.1.85 లక్షల కోట్ల వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. 2028 నాటికి ఇక్కడ హైడ్రోజన్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించాలన్నది లక్ష్యం. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 57 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం 80 గిగావాట్లు. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు ఇందులో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిసింది. వాస్తవంగా పదేళ్ల క్రితమే ఎన్‌టీపీసీ ఇక్కడ సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను నిర్మించాల్సి వుంది.

పూడిమడకలో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌
ఎన్‌టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ శంకుస్థాపన కార్యక్రమాన్ని వీక్షించేందుకు పూడిమడక వద్ద ఏర్పాటు చేసిన వేదిక, ఎల్‌ఈడీ స్కీన్‌

నేడు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన

80 గిగావాట్ల విద్యుదుత్పత్తి

రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడి

ప్రత్యక్షంగా, పరోక్షంగా 57 వేల మందికి ఉపాధి

అచ్యుతాపురం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని పూడిమడక సమీపంలో ఎట్టకేలకు ఎన్‌టీపీసీ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు కానున్నది. ఎన్‌టీపీసీ అనుబంధ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నిర్మించే ‘గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌’కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.1.85 లక్షల కోట్ల వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. 2028 నాటికి ఇక్కడ హైడ్రోజన్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించాలన్నది లక్ష్యం. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 57 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం 80 గిగావాట్లు. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు ఇందులో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిసింది. వాస్తవంగా పదేళ్ల క్రితమే ఎన్‌టీపీసీ ఇక్కడ సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను నిర్మించాల్సి వుంది. 2015లో సీఎంగా వున్న నారా చంద్రబాబునాయుడు పూడిమడక-అచ్యుతాపురం రోడ్డులో రాంబిల్లి మండలం పూడి గ్రామం వద్ద 1,200 ఎకరాలు కేటాయించారు. సముద్ర తీరంలో నిర్మించే తొలి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. రూ.28,828.29 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు వేల మెగావాట్ల (ఒక్కో యూనిట్‌ వెయ్యి మెగావాట్ల సామర్థ్యం) విద్యుదుత్పత్తి చేయాలన్నది ప్రణాళిక. ఆస్ర్టేలియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవడానికి పూడిమడక వద్ద హార్బర్‌ నిర్మించడానికి ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేసింది. అనంతరం ఎన్‌టీపీసీ యాజమాన్యం విద్యుత్‌ కేంద్రానికి కేటాయించిన భూమి చుట్టూ ప్రహరీగోడ నిర్మించింది. ప్రధాన ప్లాంట్‌ నిర్మాణ పనులు మొదలయ్యే తరుణంలో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి నాడు టీడీపీ వైదొలగడంతో ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి వీలుకాదని కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్‌టీపీసీ విద్యుత్‌ కేంద్రంలో ఎటువంటి కదలికలేదు. కాగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటును తగ్గించాలని, గ్రీన్‌ ఎనర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూడిమడక వద్ద ఎన్‌టీపీసీ ఆధీనంలో వున్న భూమిలో గ్రీన్‌ హైడ్రోజన్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. దీంతో మోదీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్‌టీపీసీ అనుబంధ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నిర్మించే ఈ ప్రాజెక్టుకు ‘గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌’గా పేరు పెట్టారు.

Updated Date - Jan 08 , 2025 | 01:05 AM