GVMC: విశాఖలో రసవత్తర రాజకీయం.. నెక్ట్స్ ఏం జరుగుతుందో..
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:35 PM
వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది. విశాఖ పట్నం జీవీఎంసీ మేయర్ పదవి దూరం కానుంది. వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూటమి పార్టీలు సిద్ధమయ్యాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ మొదలైంది. వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూటమి పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూటమి నేతలు జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానంపై నోటీస్ ఇవ్వనున్నారు. కొద్దిరోజుల క్రితమే మేయరుపై అవిశ్వాసం పెట్టడానికి టీడీపీ ఫ్టోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు సంతకాలు సేకరించారు. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు నగర ఎమ్మెల్యేలు జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ మేయరుపై అవిశ్వాసానికి సర్వం సిద్ధం అయింది.
కూటమికే బలం..
విశాఖ నగరంలో మొత్తం 98 కార్పోరేటర్ స్థానాలు ఉన్నాయి. వంశీ కృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందటంతో ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున 29 మంది కార్పోరేటర్లుగా గెలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. జనసేనకు ముగ్గురు కార్పోరేటర్లు ఉండగా..వైసీపీ, స్వతంత్ర కార్పోరేటర్లు ఏడుగురు జనసేనలో చేరారు. బీజేపీ నుంచి ఒకరు కార్పోరేటర్‌గా గెలవగా.. వైసీపీ నుంచి ఒకరు చేరారు. సోమవారం మరో తొమ్మిది మంది టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. వీరితో పాటు విశాఖపట్నం, అనకాపల్లి కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలుపుకుని 109 ఓట్లకుగాను, కూటమి బలం 73కు చేరింది. సీపీఐకి చెందిన స్టాలిన్, ముత్తంశెట్టి కూతురు కూటమికే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
CM Chandrababu Tweet: సీఎం చంద్రబాబు సంచలన ట్వీట్.. లైట్లు ఆపేయాలంటూ..
Road Accidents: లారీని ఢీకొట్టిన టూరిస్టు బస్సు.. ఎంతమంది విద్యార్థులు