పూడిమడక సభకు భారీగా హాజరు
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:17 AM
మండలంలోని పూడిమడక వద్ద ఏర్పాటు చేయనున్న ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పూడిమడక సమీపంలోని ఎన్‌టీపీసీ స్థలంలో వేదికను ఏర్పాటు చేసి, భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ప్రత్యక్ష ప్రసారం చేశారు.
గ్రీన్ హైడ్రోజన్ హబ్ వర్చువల్ శంకుస్థాపనను తిలకించిన నాయకులు, ప్రజలు
అచ్యుతాపురం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పూడిమడక వద్ద ఏర్పాటు చేయనున్న ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పూడిమడక సమీపంలోని ఎన్‌టీపీసీ స్థలంలో వేదికను ఏర్పాటు చేసి, భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ శాఖలు, ఎన్టీపీసీ అధికారులతోపాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రధాని రోడ్ షో నుంచి బహిరంగ సభ ముగిసే వరకు ఆసాంతం తిలకించారు. మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడినప్పుడు ఇక్కడ చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ప్రముఖుల ప్రసంగాలు సరిగా వినిపించలేదు. చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నప్పుడు ఒక్కో మాట రెండేసిసార్లు వినపడడంతో కార్యకర్తలు అసహనం చెందారు. ఇక్కడ అధికారులు చేసిన ఏర్పాట్లుకన్నా ఎక్కువ మంది హాజరు కావడంతో కూర్చీలు ఖాళీ లేక పలువురు నిల్చుండిపోయారు. బహిరంగ సభ తరువాత భోజనం ప్యాకెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్‌చార్జి సుందరపు సతీశ్‌కుమార్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, ఎలమంచిలి నియోజకవర్గం బీజేపీ ఇన్‌చార్జి రాజాన సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు.