Share News

బల్క్‌ డ్రగ్‌ పార్కుకు శ్రీకారం

ABN , Publish Date - Jan 09 , 2025 | 01:16 AM

నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న బల్క్‌ డ్రగ్‌ పార్కుకు బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజలు, అధికారులు, నాయకులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు రాజయ్యపేట-బోయపాడు రహదారి పక్కన భారీ టెంట్‌ వేసి ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేశారు.

బల్క్‌ డ్రగ్‌ పార్కుకు శ్రీకారం
బల్క్‌ డ్రగ్‌ పార్కు వర్చువల్‌ శంకుస్థాపనను తిలకిస్తున్న కూటమి నేతలు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు

ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన

రాజయ్యపేట వద్ద ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించిన నేతలు, అధికారులు

నక్కపల్లి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న బల్క్‌ డ్రగ్‌ పార్కుకు బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజలు, అధికారులు, నాయకులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు రాజయ్యపేట-బోయపాడు రహదారి పక్కన భారీ టెంట్‌ వేసి ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జాయింట్‌ కలెక్టర్‌ జాహ్నవి, నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ, తహసీల్దార్‌ నరసింహమూర్తి, కూటమి నాయకులు తోట నగేశ్‌, పాకలపాటి రవిరాజు, కొప్పిశెట్టి వెంకటేశ్‌, కొప్పిశెట్టి కొండబాబు, కురందాసు నూకరాజు, కొప్పిశెట్టి బుజ్జి, శ్రీను, గింజాల లక్ష్మణరావు, వైబోయిన రమణ, పోలినాటి నానాజీ, కొప్పిశెట్టి శ్రీను, తోలేటి శ్రీను, తదితరులు హాజరయ్యారు.

Updated Date - Jan 09 , 2025 | 01:16 AM