Share News

భక్తిశ్రద్ధలతో భోగి

ABN , Publish Date - Jan 14 , 2025 | 12:54 AM

భోగి పండుగను సోమవారం వాడవాడలా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు వేకువజామునే నిద్రలేచి ఇళ్ల ముందు, రహదారులపైన, కూడళ్లలో భోగి మంటలు వేశారు. అనంతరం తలస్నానాలు చేసి దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. మహిళలు ఇళ్ల ముందు రంగురంగులతో ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు, పూలతో అలంకరించారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో వుంటున్న వారు సంక్రాంతి పండగను సొంతూరులో బంధువులు, స్నేహితుల కలిసి ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇప్పటికే గ్రామాలకు చేరుకున్నారు. దీంతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది.

భక్తిశ్రద్ధలతో భోగి
అనకాపల్లి వేగివీధిలో భోగి మంట

జిల్లా అంతటా సంప్రదాయంగా జరుపుకున్న ప్రజలు

వేకువజామునే ఇళ్ల ముందు, కూడళ్లలో భోగి మంటలు

ముంగిళ్లను రంగవల్లులతో తీర్చిదిద్దిన మహిళలు

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌ వర్క్‌)

భోగి పండుగను సోమవారం వాడవాడలా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు వేకువజామునే నిద్రలేచి ఇళ్ల ముందు, రహదారులపైన, కూడళ్లలో భోగి మంటలు వేశారు. అనంతరం తలస్నానాలు చేసి దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. మహిళలు ఇళ్ల ముందు రంగురంగులతో ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు, పూలతో అలంకరించారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో వుంటున్న వారు సంక్రాంతి పండగను సొంతూరులో బంధువులు, స్నేహితుల కలిసి ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇప్పటికే గ్రామాలకు చేరుకున్నారు. దీంతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది.

శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి పండుగలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా భోగి మంటను వెలిగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలుగువారి సంప్రదాయాలకు మరింత వన్నె తెచ్చేలా ఇటువంటి పండుగలను ఘనంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అనకాపల్లి ఎన్టీఆర్‌ స్టేడియంలో ఎంపీ సీఎం రమేశ్‌ ఆధ్వర్యంలో భోగి, సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఎంపీ రమేశ్‌, శ్రీదేవి దంపతులు భోగి మంటను వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

నక్కపల్లి సమీపంలోని తన నివాసంలో హోం మంత్రి వంగలపూడి అనిత సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఆవరణలో ఏర్పాటు చేసిన భోగి మంటను వెలిగించారు. కోలాటం, గంగిరెద్దుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

Updated Date - Jan 14 , 2025 | 12:54 AM