ముమ్మరంగా వరి నూర్పులు
ABN , Publish Date - Jan 11 , 2025 | 11:00 PM
జిల్లాలో వరి నూర్పులు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయ పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు. ఈ ఏడాది వరి దిగుబడి పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పనుల్లో రైతులు నిమగ్నం
కె.కోటపాడు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరి నూర్పులు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయ పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు. ఈ ఏడాది వరి దిగుబడి పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కె.కోటపాడు మండలంలో రైతులు ఒకరికొకరు సాయం చేసుకుంటూ వరి నూర్పులు పూర్తి చేస్తున్నారు. సంక్రాంతిలోగా వరి నూర్పు పనులు పూర్తి చేసుకోవాలన్న పట్టుదలతో రైతులు ఉన్నారు.