Share News

Crime News: విశాఖలో జర్నలిస్టునంటూ వ్యక్తి హల్‌చల్

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:58 PM

విశాఖలో ఓ వ్యక్తి జర్నలిస్టులంటూ హల్‌చల్ చేశాడు. ఐస్‌క్రీం పార్లర్‌లోకి వెళ్లి ఐస్‌క్రీం తిన్నాడు. సిబ్బంది డబ్బులు అడిగినందుకు వారిపై దాడి చేశారు.దీంతో షాపు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Crime News: విశాఖలో జర్నలిస్టునంటూ వ్యక్తి హల్‌చల్
Crime News

విశాఖ జిల్లా: అక్కయ్యపాలెం (Akkayyapalem)లోని ఐస్‌క్రీం పార్లర్‌లో (ice cream parlour) జర్నలిస్టు (journalist) నంటూ ఓ వ్యక్తి హల్‌చల్ (Hull Chal) చేశాడు. రిపోర్టర్‌నంటూ ఐస్‌క్రీం పార్లర్‌ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. పార్లర్‌లో ఐస్‌క్రీం తీసుకున్నాడు. డబ్బులు అడిగినందుకు సిబ్బందిపై దాడి చేశాడు. దాడి చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పార్లర్ సిబ్బంది చెబుతున్నారు. దాడి ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ (Viral) అవుతున్నాయి.

Also Read..: భర్తపై అలిగి భార్య ఆత్మహత్యాయత్నం..


తాము తిన్న ఐస్ క్రీంకు డబ్బులు అడిగినందుకు ఆ వ్యక్తి సిబ్బందిపైనే దాడి చేశాడు. తననే డబ్బులు అడుగుతావా.. జర్నలిస్టునంటూ బెదిరించాడు. పార్లర్ సిబ్బంది నిలువరించినప్పటికీ ఆ వ్యక్తి ఆగలేదు. కౌంటర్‌లో ఉన్న సిబ్బందిని కూడా కొట్టాడు. అంతు చూస్తానంటూ బెదిరించాడు. దాడి చేసిన వ్యక్తితోపాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. వారు వెళ్లిపోయిన తర్వాత పార్లర్ సిబ్బంది సీసీ పుటేజీ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.


వచ్చిన వ్యక్తులు ఎవరు..ఎక్కడి నుంచి వచ్చారన్నదానిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని షాపు యజమాని శివరామ కృష్ణ పోలీసులను కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే మద్యం మత్తులో ఉండడంవల్లే తాము దాడికి పాల్పడ్డమంటూ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. కాగా ఇది సెటిల్‌మెంట్ వ్వవహారంలా కనిపిస్తోంది. అయితే పోలీసులు మాత్రం వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని వాళ్లను అరెస్టు చేస్తామని చెబుతున్నారు. తమను అకారణంగా కొట్టారని, సరైన కారణం లేదని, కేవలం తిన్న ఐస్‌క్రీంకు డబ్బులు అడిగినందుకు తమపై దాడి చేశారని పార్లర్ సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీలోకి వైసీపీ కీలక నేతలు..

సీఎం చంద్రబాబును అభినందించిన ఎంపీలు..

ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా యువకులు ఆత్మహత్యాయత్నం..

For More AP News and Telugu News

Updated Date - Mar 28 , 2025 | 02:34 PM