ఏవోబీలో మావోయిస్టుల డంప్ స్వాధీనం
ABN , Publish Date - Jan 12 , 2025 | 10:58 PM
ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఒడిశా పోలీసులు మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ వివేకానందశర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
సీలేరు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఒడిశా పోలీసులు మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ వివేకానందశర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్కన్‌గిరి జిల్లా ఎంవీ 79 పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్టగూడ, కత్తనపల్లి జినెల్‌గూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో డీవీఎఫ్ పోలీసులు ఈ ప్రాంతాల్లో ఆదివారం గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టుల భారీ డంప్‌ను పోలీసులు గుర్తించి వెలికి తీశారు. డంప్‌లో ఒక ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, రెండు ఎస్‌ఎల్‌ఆర్ మ్యాగ్జైన్‌లతో పాటు పలు రకాల పేలుడు పదార్థాలు, మావోయిస్టుల విప్లవ సాహిత్యం లభ్యమైనట్టు ఎస్పీ పేర్కొన్నారు. భద్రతా బలగాలను హతమార్చేందుకే మావోయిస్టులు డంప్‌లో వీటిని దాచి పెట్టారని, ఈ డంప్ ఆంధ్రా, ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీకి చెందినదిగా అనుమానిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.