Share News

Lokesh On Visakhapatnam: ఏపీ ఐకానిక్ క్యాపిటల్‌గా విశాఖ

ABN , Publish Date - Mar 31 , 2025 | 02:58 PM

Lokesh On Visakhapatnam: విశాఖను దేశంలోనే ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని.. విశాఖను ఒక బ్రాండ్‌గా మార్చుతామని చెప్పుకొచ్చారు.

Lokesh On Visakhapatnam: ఏపీ ఐకానిక్ క్యాపిటల్‌గా విశాఖ
Lokesh On Visakhapatnam

విశాఖపట్నం, మార్చి 31: విశాఖను హైదరాబాద్ కంటే గొప్పగా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. విశాఖలో పర్యటినస్తున్న మంత్రి ఆర్కే బీచ్‌ వద్ద వరుణ్ గ్రూప్ నిర్వహిస్తున్న వరుణ్ బే సౌండ్స్ హోటల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... వరుణ్ బే సాండ్స్ హోటల్ విశాఖకు ఐకానిక్ గా మారనుందన్నారు. విశాఖ పరిశ్రమలు, ఐటీ హబ్‌గా మార్చుతున్నామన్నారు. గడిచిన 10 నెలల్లో విశాఖకు చాలా ప్రాజెక్టులు తీసుకువచ్చామని.. రానున్న 5 సంవత్సరాల్లో విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. విశాఖను ఆంధప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్‌గా మార్చుతామని చెప్పారు.


విశాఖను దేశంలోనే ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని.. విశాఖను ఒక బ్రాండ్‌గా మార్చుతామని చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల్లో తనకు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీల స్థానాల్లో మూడవ స్థానం వచ్చినందుకు కొంచెం బాధనిపించిందని.. కానీ మొదటి రెండు అత్యధిక మెజారిటీ స్థానాలు విశాఖకు వచ్చాయన్నారు. దీన్ని బట్టి విశాఖ ప్రజలు తమపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారని అర్థమైందన్నారు. విశాఖ అభివృద్ధి చేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.

Kodali Nani Health: ప్రత్యేక విమానంలో ముంబైకి కొడాలి నాని.. కారణమిదే


వరుణ్ గ్రూప్ నిర్మాణం చేపడుతున్న వరుణ్ బే సాండ్స్ హోటల్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు... భారతదేశంలోనే ఒక ఐకానిక్ ప్లేస్‌గా మిగులుతుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ వైపు పరుగులు పెడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా, పర్యాటకంగా, ఐటీ పరంగా అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రజలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారన్నారు. చంద్రబాబును విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోకి నగరంలోకి రాకుండా అడ్డగించారన్నారు. విజయనగరం తీర్థాలు గుడికి వెళుతుంటే బుల్డేజర్లు, జేసీబీలు పెట్టి రాకుండా చేయాలని చేశారని మండిపడ్డారు. లులు గ్రూప్ కూడా త్వరలో విశాఖకు వస్తుందన్నారు. గడిచిన 10 నెలల్లోనే విశాఖకు టీసీఎస్, మెటల్ ప్లాంట్, హైడ్రోజన్ ప్లాంట్ వంటి సమస్యను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా తీసుకున్నామని చెప్పారు.


‘ మన ముఖ్యమంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు.. స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ చేయమంటున్నారు’ అని అన్నారు. ఉత్తరాంధ్రలోనే ట్రిలియన్ డాలర్ ఎకానమీని తీసుకొస్తామని గర్వంగా చెప్తున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాలని... 9 నెంబర్లలో లార్జెస్ట్ ఎకనామికల్ సిటీగా ఉన్న విశాఖను పదోవ స్థానానికి దించారని విమర్శలు గుప్పించారు. ఎంపీ భరత్, విశాఖ శాసనసభ్యులు దృష్టి సారించి విశాఖను 5వ లార్జెస్ట్ ఎకనామికల్ సిటీగా నిలబెడతారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఐటీ డెస్టినేషన్‌గా మారుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని... ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా పూర్తయిందని వెల్లడించారు. విశాఖ అన్ని విధాల అభివృద్ధి చెందడానికి అనువైన ప్రాంతమన్నారు. హోటల్స్, కాన్సెర్ట్స్, క్రికెట్ మ్యాచ్లు జరిగే వైబ్రేంట్ సిటీ విశాఖపట్నం అని తెలిపారు.


అమరావతి భవనాలు మూడేళ్లలో నిర్మాణం చేస్తామని.. ఇప్పుడు వరుణ్ గ్రూప్ నిర్మాణం చేపడుతున్న హోటల్ రెండేళ్లలోనే పూర్తి చేస్తారని నమ్మకం ఉందన్నారు. 2027 మార్చి 31 లోపు వరుణ్ గ్రూప్ చేపడుతున్న వరుణ్ బే సాండ్స్ హోటల్‌ను పూర్తి చేయాలన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సంవత్సరంలోపు ప్రారంభం చేస్తామన్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు కన్నా ముందే... భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

Nagar Kurnool Incident: దైవదర్శనానికి వచ్చిన మహిళపై దారుణం

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 31 , 2025 | 02:58 PM