Share News

వీఎంఆర్‌డీఏ సెక్రటరీగా మురళీకృష్ణ

ABN , Publish Date - Jan 08 , 2025 | 12:33 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో కొద్దికాలంగా ఖాళీగా ఉన్న సెక్రటరీ, ఎస్టేట్‌ అధికారి పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం భర్తీ చేసింది.

వీఎంఆర్‌డీఏ సెక్రటరీగా మురళీకృష్ణ

ఎస్టేట్‌ ఆఫీసర్‌గా దయానిధి

విశాఖపట్నం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో కొద్దికాలంగా ఖాళీగా ఉన్న సెక్రటరీ, ఎస్టేట్‌ అధికారి పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం భర్తీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక వార్షిక బదిలీల్లో భాగంగా వీఎంఆర్‌డీఏ సెక్రటరీ కీర్తిని విజయనగరం జిల్లా ఆర్‌డీఓగా బదిలీ చేసింది. ఇప్పుడు ఆ స్థానంలో డిప్యూటీ కలెక్టర్‌ పి.మురళీకృష్ణను నియమించింది. అలాగే ఎస్టేట్‌ అధికారి లక్ష్మారెడ్డిని గతంలో అమరావతికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో డిప్యూటీ కలెక్టర్‌ బి.దయానిధిని నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

ప్రధాని సభకు 500 ఆర్టీసీ బస్సులు

విశాఖపట్నం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి):

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు విశాఖ జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుంచి జనాలను తరలించేందుకు 500 బస్సులను కేటాయించినట్టు విశాఖ ఆర్టీసీ రీజియన్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు తెలిపారు. దాంతో పాటు నగర పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా ఉన్నందున సిటీ సర్వీసులు తగ్గుతాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు.

8 మెడికల్‌ క్యాంపులు

బహిరంగ సభ ప్రాంగణంలో ఆరోగ్యశాఖ ఎనిమిది మెడికల్‌ క్యాంపులను ఏర్పాటుచేస్తోంది. ఒక్కో క్యాంపులో వైద్యుడు, ఫార్మసిస్ట్‌, స్టాఫ్‌ నర్సుతోపాటు ఏఎన్‌ఎంలు సేవలు అందిస్తారు. అలాగే ఏడు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచనున్నారు.

Updated Date - Jan 08 , 2025 | 12:33 AM