Share News

చింతపల్లి ఏఎస్‌పీగా నవజ్యోతి మిశ్రా

ABN , Publish Date - Jan 13 , 2025 | 11:23 PM

చింతపల్లి అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఏఎస్‌పీ)గా నవజ్యోతి మిశ్రాను ప్రభుత్వం నియమించింది. శిక్షణ పూర్తి చేసుకున్న 2021 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారికి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది.

చింతపల్లి ఏఎస్‌పీగా నవజ్యోతి మిశ్రా
నవజ్యోతి మిశ్రా

పాడేరు/చింతపల్లి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): చింతపల్లి అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఏఎస్‌పీ)గా నవజ్యోతి మిశ్రాను ప్రభుత్వం నియమించింది. శిక్షణ పూర్తి చేసుకున్న 2021 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారికి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఇందులో భాగంగా నవజ్యోతి మిశ్రాను చింతపల్లి ఏఎస్‌పీగా నియమించింది. బిహార్‌కు చెందిన నవజ్యోతి మిశ్రా ఢిల్లీలోని జవహర్‌లాల్‌ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్‌ చేసి, 2021లో సివిల్స్‌ ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని గేహౌండ్స్‌లో అసాల్ట్‌ కమాండెంట్‌గా ఉన్న ఆయనకు చింతపల్లి ఏఎస్‌పీగా పోస్టింగ్‌ ఇచ్చింది.

Updated Date - Jan 13 , 2025 | 11:23 PM