Share News

న్యూ ఇయర్‌ సందడి

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:25 AM

నూతన సంవత్సర వేడుకలను నగరవాసులు ఆనందో త్సాహాలతో జరుపుకున్నారు. కొత్త సంవత్సరంలో మొదటి రోజున చాలామంది దైవదర్శనం చేసుకుంటుంటారు. దీంతో నగర పరిధిలోని అనేక దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా సింహాచలం దేవస్థానం, ఆశీల్‌మెట్టలోని సంపత్‌ వినాయక్‌, వన్‌టౌన్‌లోని శ్రీకనకమహలక్ష్మి అమ్మవారి ఆలయాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఇక ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద సందడి ఎక్కువగా కనిపించింది. ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు బారులుతీరారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు కార్యాలయాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతాధికారులకు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు.

న్యూ ఇయర్‌ సందడి

కిటకిటలాడిన ఆలయాలు

ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షులు తెలిపేందుకు బారులుతీరిన నేతలు, కార్యకర్తలు

భారీగా స్వీట్లు, పూల బొకేల విక్రయాలు

విశాఖపట్నం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి):

నూతన సంవత్సర వేడుకలను నగరవాసులు ఆనందో త్సాహాలతో జరుపుకున్నారు. కొత్త సంవత్సరంలో మొదటి రోజున చాలామంది దైవదర్శనం చేసుకుంటుంటారు. దీంతో నగర పరిధిలోని అనేక దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా సింహాచలం దేవస్థానం, ఆశీల్‌మెట్టలోని సంపత్‌ వినాయక్‌, వన్‌టౌన్‌లోని శ్రీకనకమహలక్ష్మి అమ్మవారి ఆలయాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఇక ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద సందడి ఎక్కువగా కనిపించింది. ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు బారులుతీరారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు కార్యాలయాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతాధికారులకు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు.

న్యూ ఇయర్‌ నేపథ్యంలో మార్కెట్‌కు జోష్‌ కనిపించింది. స్వీట్లు, ఫ్రూట్‌బాక్సులు, పూల బొకేల విక్రయాలు పెద్దఎత్తున సాగాయి. గత ఏడాదితో పోలిస్తే స్వీట్లు, కేకుల విక్రయాలు సుమారు 20 శాతం వరకు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. స్వీట్స్‌ అమ్మకాలు భారీగా జరిగాయి. సగటున ఒక్కో దుకాణంలో 100 నుంచి 200 కిలోల స్వీట్లు విక్రయించినట్టు చెబుతున్నారు.

Updated Date - Jan 02 , 2025 | 01:26 AM