Share News

212 మందిపై డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:20 AM

నగరంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న 212 మందిపై డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు నమోదుచేసినట్టు పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ కేసులు నమోదుచేశామన్నారు. డిసెంబరు 31 సందర్భంగా నగరంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు 28 చోట్ల ప్రత్యేక బృందాలు బ్రీత్‌ అనలైజర్లతో తనిఖీ చేపట్టాయన్నారు.

212 మందిపై  డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు

పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి

ఎక్కడికక్కడ తనిఖీల ద్వారా

ఒక్క రోడ్డు ప్రమాదం కూడా

చోటుచేసుకోకుండా నివారించగలిగాం

విశాఖపట్నం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి):

నగరంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న 212 మందిపై డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు నమోదుచేసినట్టు పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ కేసులు నమోదుచేశామన్నారు. డిసెంబరు 31 సందర్భంగా నగరంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు 28 చోట్ల ప్రత్యేక బృందాలు బ్రీత్‌ అనలైజర్లతో తనిఖీ చేపట్టాయన్నారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా ఈ ఏడాది ఒక్క ప్రమాదం కూడా జరగకుండా అడ్డుకోగలిగామన్నారు. అలాగే సైలెన్సర్లు మార్చి ఎక్కువ శబ్దం వచ్చేలా వాహనాలను నడుపుతున్న ముగ్గురిపై, బీచ్‌రోడ్డుతోపాటు నగరంలో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్న ఎనిమిది మందిపై కేసులు నమోదుచేసినట్టు సీపీ చెప్పారు. 31వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు మొదలైన తనిఖీలు బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 01:20 AM