నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:12 AM
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
మహారాణిపేట, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లలో కలెక్టర్, జిల్లా అధికారులు నిమగ్నం కావడంతో కార్యక్రమం రద్దు చేశామన్నారు. కాగా జీవీఎంసీలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు. వీఎంఆర్‌డీఏ, నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.
----------------------------------------------------------------------------------
స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు నేడు ద్విచక్ర వాహన ర్యాలీ
బీచ్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర
ఉక్కుటౌన్‌షిప్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంట్ పరిరక్షణలో భాగంగా సెయిల్‌లో విలీనం చేయాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ద్విచక్ర వాహనాల ర్యాలీ చేపట్టామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ కేఎస్‌ఎన్ రావు తెలిపారు. ర్యాలీ కూర్మన్నపాలెం దీక్షా శిబిరం వద్ద బయలుదేరి వడ్లపూడి, శ్రీనగర్, పాతగాజువాక, షీలానగర్, ఎన్‌ఏడీ జంక్షన్, కరాస, కంచరపాలెం మెట్టు, తాటిచెట్లపాలెం రోడ్డు, రైల్వే గ్రౌండ్స్, తెలుగుతల్లి రోడ్డు, సిరిపురం జంక్షన్, పాండురంగస్వామి గుడి, ఆర్‌కె బీచ్ మార్గంలో బీచ్ సైడ్ బేకరీ జంక్షన్ వద్ద వాహనాలను పార్క్ చేసి, అక్కడి నుంచి కలెక్టరేట్‌కు పాదయాత్ర ద్వారా వెళ్లి, కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తామన్నారు.